Basat Ali: ప్రస్తుత కోచ్ ను పదవి నుంచి తప్పించాలి 8 d ago

పాకిస్థాన్ క్రికెట్ టీమ్ వరుస వైఫల్యాలతో కఠిన పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన టీ20, వన్డే సిరీస్ లోనూ ఘోర పరాజయం ఎదురైంది. ఈ మేరకు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసత్ అలీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, సెలక్షన్ కమిటీ మీద నిప్పులు చెరిగాడు. ప్రతిష్ఠాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి కేవలం ఒకే ఒక ఫ్రంట్ లైన్ స్పిన్నర్ తో ఎలా బరిలోకి దిగారని ప్రశ్నించాడు. టమాటాలు అమ్ముకునే వారికే మీ కన్నా ఎక్కువ పరిజ్ఞానం ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిన టీమ్ లో స్పిన్నర్లను ఎందుకు తీసుకోలేదని చివరికి వారు కూడా ప్రశ్నిస్తున్నారు అని అలీ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుత కోచ్ ఆకిబ్ జావేద్ ను పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశాడు.